సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన
మెదక్ కలెక్టరేట్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శనివారం 12వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ప్రధాన రహదారిపై ‘సడక్‌పై చదువులు’ పేరుతో పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మా టను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సమగ్ర ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో విద్యాబోధన కుంటుపడిందని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి పాషా, మహిళ అధ్యక్షురాలు భార్గవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, కోశాధికారి సంపత్, కేజీబీవీ ఎస్‌ఓలతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment