మహాసభలను జయప్రదం చేయండి
మెదక్ కలెక్టరేట్: సీపీఎం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభలలో మూడేళ్లలో జరిగిన ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల పోరాటాలను సమీక్షించనున్నట్లు చెప్పారు. ఫలితాలను చర్చించి గత పోరాట అనుభవాలతో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తారని వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, నాయకులు అనిల్, షౌకత్ అలీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment