విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్జీటీయూ
మెదక్ కలెక్టరేట్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం అన్నారు. గురువారం డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త మండలాలల్లో సామగ్రి, ఎంఈఓ కార్యాలయం సిబ్బందిని పూర్తిగా నియమించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూని యన్ జిల్లా అధ్యక్షుడు జంక అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిమల్లె జగన్, ఇతర సభ్యు లు పరశురాం, దివ్య, ఉపేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌పై
చర్యలు తీసుకోండి
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించాలని డీఆర్‌డీఓ శ్రీని వాసరావుకు గురువారం వెల్మకన్న గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలు అవకతవకలకు పాల్పడుతున్నాడని తెలిపారు. గతంలో ఓసారి సస్పెండ్ అయిన తిరిగి విధుల్లో చేరాడన్నారు. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీలో సైతం తిరిగి అధికారులు సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. మరోసారి అతడిని విధుల్లోకి తీసుకోకుండా చూడాలని అధికారులను కోరా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు రాజేందర్, ప్రకాష్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏకపక్షంగా ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు.
అన్ని అంశాలపై అవగాహన అవసరం: డీఈఓ
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. ఈనెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురు వారం మెదక్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవే ట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల వివరాలను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి వివరించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, హెచ్‌ఎం రేఖ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘జ్యోతి యాత్ర’ను
విజయవంతం చేయాలి
చేగుంట(తూప్రాన్): అమరవీరుల జ్యోతి యాత్రను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. చేగుంటలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి 28 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 25న చేగుంట మండలం పొలంపల్లి శివారులో కేవల్‌కిషన్ సమాధి నుంచి అమరవీరుల జ్యోతి యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా నాయకురాలు బాలమణి, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment