తాగునీటి సమస్య పరిష్కరిస్తా
హవేళిఘణాపూర్(మెదక్): నియోజకవర్గం పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పాతూర్–శమ్నాపూర్ తండాకు రోడ్డు నిర్మాణం, ఔరంగాబాద్ తండా నుంచి పాతూర్ వరకు రోడ్డు నిర్మాణం, హవేళిఘణాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్, ఫరీద్‌పూర్‌లో సహకార సంఘ భవన దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువ జన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశురామ్‌గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీకాంత్, మొండి పద్మారావు, రాము, శేఖర్, ఫరీద్‌పూర్ సొసైటీ చైర్మన్ బ్రహ్మం, సీఈవో అమీర్, మాజీ సర్పంచ్ బ్రహ్మం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment