వేగం కన్నా.. ప్రాణం మిన్న
మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: వేగం కన్నా.. ప్రాణం మిన్న అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. వాహనదారులు అన్నిపత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దన్నారు. జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ సైతం పోయరని.. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంస పత్రాలు అందించడానికి జాబితా ఇవ్వాలన్నారు. అనంతరం ఈ– ఆఫీస్ అమలుపై అధికారులతో సమీక్షించారు. పేపర్, ప్లాస్టిక్, ఎలక్ట్రిక్ లెస్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియెట్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున తల్లిదండ్రులు విద్యార్థులను ఫోన్, టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విభజించి బోధన చేయాలని ఆదేశించారు.
డేటా నమోదు కీలకం
హవేళిఘణాపూర్(మెదక్): ఆన్‌లైన్ డేటా ప్రక్రియ ఎంతో కీలకమని, ఎలాంటి తప్పుల్లేకుండా జాగ్రత్తతో నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభ్యంతరాల డేటా ఎంట్రీని పరిశీలించారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ ఫిర్యాదు, దరఖాస్తు వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్న డైట్ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment