ఆత్మీయ భరోసాకు ఆంక్షలు వద్దు
నర్సాపూర్ రూరల్: భూమిలేని రైతు కూలీలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పెద్దచింతకుంటలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని కోరారు. అయితే ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేని మండిపడ్డారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదంతో జరగగా ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ లింగం పోలీస్ సిబ్బందితో ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇదిలా ఉండగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడటం సరికాదని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ప్రజాపాలన గ్రామసభలు అర్హులను గుర్తించడం కోసమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివకుమార్, మాజీ ఎంపీటీసీ నర్సింగ్‌రావు, షేక్ హుస్సేన్, జీవన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, రింగుల ప్రసాద్, భిక్షపతిగౌడ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కోతల ప్రభుత్వం..
కౌడిపల్లి(నర్సాపూర్): అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం కౌడిపల్లిలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్, బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండానే రూ. 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని సీఎం, మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది చేతల ప్రభుత్వం కాదని, కోతల ప్రభుత్వమని అన్నారు. కేసీఆర్ పాలనలో అర్హులందరికీ రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ రాజు, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, నాయకులు పోల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న
కాంగ్రెస్ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment