అన్నిరంగాల్లో ముందుండాలి
మెదక్ కలెక్టరేట్: అమ్మాయిలు అన్నిరంగాల్లో ముందుండాలని, వారి ఆరోగ్య సంరక్షణకు పౌష్టికాహారం తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి హైమావతి సూచించారు. బేటి బచావో– బేటి పడావో పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేటి బచావో బేటి పడావో పథకం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం షీటీం సేవలను సంబంధిత అధికారి విజయ్ విద్యార్థినులకు వివరించారు. అత్యవసర సమయాల్లో 1098, 100, 181 నంబర్లలో సంప్రదించాలన్నారు. అనంతరం భరోసా అడ్వకేట్ శ్వేత బాలికల చట్టాల గురించి వివరించారు.
డీడబ్ల్యూఓ హైమావతి
Comments
Please login to add a commentAdd a comment