హైదరాబాద్‌లో పుట్టి హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు అమ్రిన్ ఖురేషి. తెలుగు చిత్రాలు ‘జులాయి’, ‘సినిమా చూపిస్త మావ’ హిందీ రీమేక్స్‌లో కథానాయికగా నటిస్తున్నారామె. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమ్రిన్ ఖురేషి మాట్లాడుతూ– ‘‘మిథున్ చక్రవర్తి కుమారుడు నమషి చక్రవర్తితో కలిసి ‘బ్యాడ్‌బాయ్’ (‘సినిమా చూపిస్త మావ’ రీమేక్), ‘జులాయి’ రీమేక్... ఇలా ఒకేసారి రెండు హిందీ సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ‘బ్యాడ్‌బాయ్’ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకుడు. ఈ సినిమా సాంగ్ షూట్‌లో పాల్గొనటానికి హైదరాబాద్ రావటం థ్రిల్‌గా ఫీలయ్యాను. నేను ఇక్కడ శివ శివానీ స్కూల్‌లో చదువుకున్నాను.
తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేశాను. చదువుకునేటప్పుడు బిజినెస్ చేయాలనుకునేదాన్ని, కానీ యాక్టింగ్ అనే ఇంట్రస్ట్ నా మైండ్‌లో ఎక్కడో ఉండటం వల్ల యాక్టింగ్‌ని ప్రొఫెషన్‌గా ఎన్నుకున్నా. ఆడిషన్స్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవటంవల్లే హిందీ సినిమాలకు సెలెక్ట్ అయ్యాను. తెలుగు ఆమ్మాయిగా ఈ రెండు సూపర్‌హిట్ మూవీస్‌లో నటించటం ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. నమిషి చక్రవర్తి మంచి కోస్టార్. ఆయన డబ్బింగ్, సాంగ్స్ విషయంలో సాయం చేస్తున్నారు. అవకాశం వస్తే తెలుగులో అందరి హీరోలతోనూ నటించాలని ఉంది. సావిత్రి, శ్రీదేవిగార్ల ఇన్‌స్పిరేషన్‌తో నటి అయ్యాను. నటిగా నన్ను నేను నిరూపించుకుంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment