Bigg Boss Lahari Shari: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో లేడీ అర్జున్‌రెడ్డి ఎవరు? అంటే చాలామంది లహరి షారి వైపు వేలు చూపిస్తారు. తనతో పెట్టుకున్నవాళ్లకు చుక్కలు చూపిస్తుందీ భామ. తన తప్పు లేనిది ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రమ్మని సవాలు విసురుతుంది. లహరి యాటిట్యూడ్ చూసి ఈమె అమ్మాయి కాదు ఆటంబాంబు అంటూ నెట్టింట కామెంట్లు కూడా వినిపించాయి.
కాగా.. సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకుంది. కానీ అదృష్టం అడ్డం తిరగడంతో ఆమె ఈ వారమే షో నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు బిగ్‌బాస్ షో నుంచి ఎంత ముట్టిందనేది చర్చనీయాంశంగా మారింది.
అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమెకు వారానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారట! ఈ లెక్కన ఇప్పటివరకు ఆమె బిగ్‌బాస్ ద్వారా ఐదారు లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన విధానాన్ని బట్టి ఈ రెమ్యునరేషన్ అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment