సుక్కు సర్‌.. కాంట్‌ వెయిట్‌‌: విజయ్‌ దేవరకొండ | Crazy Combination Sukumar To Direct Vijay Devarakonda New Movie | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌‌: సు​కుమార్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

Published Mon, Sep 28 2020 12:26 PM | Last Updated on Mon, Sep 28 2020 3:14 PM

Crazy Combination Sukumar To Direct Vijay Devarakonda New Movie - Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ- జీనియన్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మించనున్న ఈ చిత్రంతో కేదార్ సెల‌గంశెట్టి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు మూవీ యూనిట్‌ ప్రకటన విడుదల చేసింది. 2022లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు పేర్కొంది.(చదవండి: బాలీవుడ్‌కి హాయ్‌)

ఇక ఈ విషయంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ‘‘నాలో ఉన్న నటుడు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇదొక గుర్తుండిపోయే సినిమా అవుతుందని హామీ ఇస్తున్నా.. సుక్కు సర్‌.. మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా’’అంటూ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే.. ‘‘నువ్వు నాకొక మంచి స్నేహితుడివి. కష్టపడే మనస్తతత్వం కలవాడివి. హ్యాపీ బర్త్‌డే కేదార్‌’’ అంటూ తన ప్రొడ్యూసర్‌ను విష్‌ చేశాడు. ఇక విజయ్‌దేవర కొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తుండగా.. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ మూవీతో సుక్కు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement