Heroine Lavanya Tripathi Suffering With Trypophobia? - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: ఆ వ్యాధితో బాధపడుతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..

Published Wed, Jun 28 2023 7:28 PM | Last Updated on Wed, Jun 28 2023 7:45 PM

Heroine Lavanya Tripathi Suffering with Trypophobia - Sakshi

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే నిశ్చితార్థంతో సగం పెళ్లైపోగా వివాహ వేడుక కోసం వీరి కుటుంబాలు మంచి ముహూర్తం ఫిక్స్‌ చేసే పనిలో ఉన్నాయి.  అప్పటివరకు జాలీగా ట్రిప్పులంటూ ఎంజాయ్‌ చేస్తోందీ సొట్టబుగ్గల సొందరి.

అవి చూస్తేనే భయం
ఇకపోతే ఈ బ్యూటీకి ఓ అరుదైన వ్యాధి ఉందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిజంగానే ఆమెకు ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠియే గతంలో స్వయంగా వెల్లడించింది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందని పేర్కొంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని రెండేళ్ల క్రితం పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.

ప్రేమ కహానీ..
కాగా 2017లో వచ్చిన మిస్టర్‌ సినిమా సమయంలో లవ్‌లో పడ్డారు లావణ్య, వరుణ్‌ తేజ్‌. ఆ తర్వాతి ఏడాది వీరు అంతరిక్షం చిత్రంలో నటించారు. జూన్‌ ప్రారంభంలో వీరి నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది చివర్లో పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం గాంఢీవదారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది.

చదవండి: ఆరు నెలల వ్యవధిలో అమ్మానాన్న మరణం.. పెళ్లి కాకుండానే ప్రియుడి ఇంటికి నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement