కాజల్ ఇల్లే వేదికగా... | Kajal Agarwal engagement and marriage at her own house itself | Sakshi
Sakshi News home page

ఇల్లే వేదికగా...

Published Wed, Oct 14 2020 2:52 AM | Last Updated on Wed, Oct 14 2020 10:08 AM

Kajal Agarwal engagement and marriage at her own house itself - Sakshi

నిశ్చితార్థం, ఆ తర్వాత పసుపు కొట్టే ఫంక్షన్, సంగీత్, మెహందీ... ఇలా పెళ్లికి ముందు రకరకాల వేడుకలు జరుగుతుంటాయి. ఆ తర్వాత పెళ్లి, రిసెప్షన్, వ్రతం... ఇలా ఎన్నో వేడుకలు. అతిథులతో పెళ్లి ఇల్లు, వేదిక కళకళలాడిపోతుంటాయి. కానీ కరోనా కారణంగా ఎక్కువమంది అతిథులతో వేడుకలు జరపడానికి లేదు. అందుకే తన పెళ్లి వేడుకలను నిరాడంబరంగా ప్లాన్‌ చేశారు కాజల్‌ అగర్వాల్‌. అక్టోబర్‌ 30న కాజల్, గౌతమ్‌ కిచ్లు వివాహం జరగనుంది. ఫంక్షన్‌ హాలు, స్టార్‌ హోటల్లో కాకుండా పెళ్లి వేదికకు తన ఇల్లు బెస్ట్‌ అనుకున్నారట కాజల్‌. ఇటీవలే ఇంటిని రీమోడలింగ్‌ చేయించారట. 20 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరగనున్నాయని తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement