త్రిప్తీ దిమ్రీ ఔట్‌... శ్రీశార్వరీ ఇన్‌ | Kartik Aaryan and Sharvari to feature in Aashiqui 3 | Sakshi
Sakshi News home page

త్రిప్తీ దిమ్రీ ఔట్‌... శ్రీశార్వరీ ఇన్‌

Published Sun, Jan 12 2025 3:05 AM | Last Updated on Sun, Jan 12 2025 3:05 AM

Kartik Aaryan and Sharvari to feature in Aashiqui 3

బాలీవుడ్‌లో ‘ఆషికీ’ మూవీ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘ఆషికీ, ఆషికీ 2’ చిత్రాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను టీ సిరీస్, వినేష్‌ ఫిల్మ్స్‌ నిర్మించాయి. హిట్‌ ఫ్రాంచైజీ కావడంతో ‘ఆషికీ 3’ని కూడా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ‘ఆషికీ 3’ని 2022లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ ఏడాది సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీలను హీరో హీరోయిన్లుగా, దర్శకుడిగా అనురాగ్‌ బసును అనుకుంటున్నారట మేకర్స్‌.

కానీ ఇప్పుడు టీ సిరీస్‌–వినేష్‌ ఫిల్మ్స్‌ ప్రతినిధుల మధ్యలో ‘ఆషికీ 3’ గురించి విభేదాలు తలెత్తాయని టాక్‌. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌గా త్రిప్తీ దిమ్రీ కూడా తప్పుకున్నారని సమాచారం. ఈ ప్లేస్‌ను బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ శార్వరీ భర్తీ చేశారని భోగట్టా. మరి... ‘ఆషికీ 3’లో శార్వరీ భాగం అయ్యారా? ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? అనే విష యాలపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement