Nayanthara Needa OTT Release In Aha On July 23 - Sakshi
Sakshi News home page

Needa Trailer: నీడ ట్రైలర్‌ రిలీజ్‌, ఆహాలో ఎప్పుడంటే?

Published Wed, Jul 21 2021 10:51 AM | Last Updated on Wed, Jul 21 2021 12:35 PM

Nayanthara Needa Trailer Released, Streaming On AHA From July 23 - Sakshi

Needa Trailer: ఓటీటీలో మలయాళ సినిమాలు విజయాలు సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నయనతార ప్రధాన పాత్రలో నటించిన నిళల్‌ మూవీ ఈ మధ్యే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైంది. తాజాగా ఈ సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది 'ఆహా'. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో ఓ పిల్లవాడు చెప్పే మర్డర్‌ స్టోరీలు నిజమవుతాయి.

చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్థిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవమని తేలడంతో మిస్టరీ పెరుగుతుంది. దాన్ని ఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి షర్మిల(నయనతార) ఏం చేశారు? షర్మిల ఫ్లాష్‌బ్యాక్‌ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా జూలై 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement