బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. సుశాంత్‌ని చంపేశారని.. డబ్బు దోచుకున్నారని.. డ్రగ్స్ అలవాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సుశాంత్ కుటుంబం అతడి ప్రేమికురాలు రియా చక్రవర్తి మీద ఈ ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాకు రియా ఇంటర్వ్యూ ఇచ్చారు. సుశాంత్ మరణించడానికి ముందు నుంచి జరిగిన సంఘటనలతో పాటు ఆ తర్వాత జరిగిన విషయాల గురించి వెల్లడించారు. సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడం గురించి స్పందించారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు ఆహ్వానించిన వారి జాబితాలో తన పేరును చేర్చలేదని తెలిపారు రియా. (చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ముప్పు : రియా)
ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ.. ‘సుశాంత్ చనిపోయాడని తెలిసి షాక్‌కు గురయ్యాను. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇంతలో అంత్యక్రియలకు హాజరు అయ్యే వారి జాబితాలో నా పేరు లేదని చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన ఇతరుల పేర్లు ఉన్నాయి. నా పేరు లేదు.. దాంతో నేను అక్కడికి వెళ్లలేను. సుశాంత్ కుటుంబానికి నేనంటే ఇష్టం లేదు. అందుకే అక్కడకు రాకూడదని కోరుకున్నారు. కానీ నేను అంత్యక్రియలకు హాజరు కావాలని భావించాను. అయితే కొందరు నన్ను వెళ్లవద్దని వారించారు. అతడి కుటుంబానికి ఇష్టం లేని పని చేయవద్దని చెప్పారు.
దాంతో ఆగిపోయాను’ అన్నారు రియా చక్రవర్తి. అంతేకాక మార్చురీ దగ్గర కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందన్నారు రియా. ‘మార్చురీ దగ్గర నేను కేవలం 3-4 సెకండ్లు మాత్రమే ఉన్నాను. బయట వేచి ఉండమని చెప్పారు. నేను సుశాంత్ మృతదేహాన్ని చూడాలని భావించాను. కానీ వెళ్లనివ్వలేదు. నా స్నేహితులు వారిని ప్రాధేయపడ్డారు. దాంతో పోస్ట్ మార్టం జరుగుతుంది వెయిట్ చేయమన్నారు. ఆ తర్వాత బాడీని వ్యాన్‌లోకి ఎక్కించారు. అప్పడు మాత్రమే కేవలం మూడంటే మూడు సెకన్లు మాత్రమే తన మృతదేహాన్ని చూడగలిగాను’ అన్నారు రియా. (చదవండి: రియాను దారుణంగా వేధిస్తున్నారు..)
సుశాంత్ ఉద్దేశించి రియా ‘సారీ బాబు’ అన్నారు. దాని గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘తను మరణించాడు. జీవితాన్ని కోల్పోయాడు. తన మరణం ఒక జోక్‌లా మారింది. ఇక క్షమించమని కోరడం తప్ప ఇంకేం చేయగలను. గౌరవపదంగా అతడి పాదాలను తాకాను. ఏ భారతీయుడైనా దీన్ని అర్థం చేసుకోగలడు’ అన్నారు రియా.
Comments
Please login to add a commentAdd a comment