ప్రేమ పుట్టడానికి కొన్ని సంవత్సరాలు అక్కర్లేదు.. ఒక్క క్షణం చాలు. కానీ ఆ క్షణం ఎదురయ్యేందుకు ఎంతకాలం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. ముద్దుగుమ్మ సమంత విషయంలో కూడా అదే జరిగింది. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేకకులను పలకరించింది సమంత. అమాయకపు చూపు, నిష్కల్మషమైన చిరునవ్వుతో తొలి చిత్రంతోనే కుర్రకారుల గుండెల్ని కొల్లగొట్టింది. అదే సమయంలో తనతో పాటు నటించిన అక్కినేని హీరో నాగచైతన్య మదిలోనూ గిలిగింతలు పెట్టింది.
ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడంతో నాగార్జున సైతం వీరి ప్రేమకు పచ్చజెండా ఊపాడు. అలా ఈ జంట 2017 అక్టోబర్ 17న ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి తర్వాత కొందరు హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. కానీ సమంత మాత్రం ఈసారి అంతకు మించిన స్పీడుతో సెలక్టివ్‌గా వైవిధ్యభరతమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్లింది. యాంకరింగ్‌లోనూ అడుగుపెట్టి అదుర్స్ అనిపించుకుంది.
తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఆమె ప్రముఖ పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇదిలా వుంటే గుణశేఖర్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ శాంకుతలంలో నటిస్తోంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంతుని పాత్ర పోషిస్తున్నాడు. నేడు ఆమె 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment