మనసుకు అయిన గాయమే పెద్దది | Sakshi
Sakshi News home page

Samanath: నేను తీసుకున్న కఠిన నిర్ణయమదే... కోలుకోవడానికి చాలా..

Published Sat, Mar 9 2024 9:12 AM

Samantha: It Was Big and Tough Decision - Sakshi

దక్షిణాది సినీ పరిశ్రమలో చాలా ధైర్యవంతురాలైన నటీమణుల్లో సమంత ఒకరు. చెన్నైలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన సమంత హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ఆమె దశ తిరిగింది. టాలీవుడ్‌ యువ హీరో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తరువాత సమంతకు వెనక్కి తిరిగి చూసుకోవాలసిన అవసరం లేకపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు తలుపుతట్టాయి. అంతే టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది.

నాగచైతన్యతో పెళ్లి - విడాకులు
తొలి రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లకు 100 రెట్లు ఫలితాన్ని పొందింది. అలాంటి సమయంలో నాగచైతన్యతో పరిచయం ప్రేమగా మారి పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి దాంపత్య జీవితం ఎక్కువ కాలం సాగలేదు. నాగచైతన్యతో మనస్పర్థలు, ఆపై తెగతెంపులు మనస్తాపానికి గురి చేయగా, వెనువెంటనే మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి సమంతను వెంటాడుతోంది.

ప్రత్యేక ఫోటోషూట్‌
అయితేనేమి సమంత ధైర్యవంతురాలు కదా, వాటన్నింటినీ ఒక పక్క ఎదుర్కొంటూనే మరోపక్క నటిగా తన స్థాయిని విస్తరింపజేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే బాలీవుడ్‌ వెబ్‌సీరీస్‌లో నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరైన సమంత ఇప్పుడు హాలీవుడ్‌ చిత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ ఫెమీనా మ్యాగ్‌జైన్‌కు ప్రత్యేకంగా ఫొటో షూట్‌ ఇచ్చింది. అందులో ఆమె హాలీవుడ్‌ హీరోయిన్లను మించి కనిపించింది. ఈ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కఠిన నిర్ణయం
యాక్టింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకోవడం గురించి సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్‌ నుంచి కోలుకునే క్రమంలో కెరీర్‌లో చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. ఇప్పటివరకూ నేను తీసుకున్న కఠిన, ఉత్తమమైన నిర్ణయం ఇదే! ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే బ్రేక్‌ తీసుకోవడం తప్పనిసరైంది. పైగా బయటకు కనిపించే గాయాల కంటే మనసుకు అయిన గాయం నుంచి కోలుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. మనకున్న ఆత్మవిశ్వాసమే గొప్ప వ్యక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది' అని చెప్పుకొచ్చింది.

చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓవరాక్షన్‌.. యూట్యూబర్‌ను కాలితో తన్నుతూ, కొడుతూ..

Advertisement

తప్పక చదవండి

Advertisement