ప్రముఖ దర్శకుడు కన్నుమూత, సల్మాన్‌ సంతాపం | Sawan Kumar Tak Passed Away, Salman Khan Shares Heartfelt Note | Sakshi
Sakshi News home page

Sawan Kumar Tak: ప్రముఖ దర్శకుడి మృతి, సల్మాన్‌ భావోద్వేగం

Published Thu, Aug 25 2022 8:41 PM | Last Updated on Thu, Aug 25 2022 9:54 PM

Sawan Kumar Tak Passed Away, Salman Khan Shares Heartfelt Note - Sakshi

బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, రచయిత శవన్‌ కుమార్‌ తక్‌(86) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శవన్‌ను బుధవారం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నేడు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీని కారణంగా అతడి శరీరంలోని అవయవాలు పని చేయడం ఆగిపోవడంతో శవన్‌ తుదిశ్వాస విడిచాడని ఆయన బంధువు, పంజాబీ సినిమా నిర్మాత నవీన్‌ మీడియాకు వెల్లడించాడు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు పేర్కొన్నాడు.

శవన్‌ కుమార్‌ మరణ వార్తపై స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 'మీపై నాకు వల్లమాలిన ప్రేమ, మీరంటే ఎంతో అభిమానం. మీ ఆ‍త్మకు శాంతికి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ ట్విటర్‌లో ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. కాగా శవన్‌ కుమార్‌ నిర్మాతగా 1967లో నౌనిహాల్‌ అనే సినిమా నిర్మించాడు. దర్శకుడిగానూ పలు సినిమాలు తెరకెక్కించిన ఆయన చివరగా 2006లో సల్మాన్‌ఖాన్‌తో సావన్‌.. ద లవ్‌ సీజన్‌ అనే మూవీ తీశాడు.

చదవండి: ఉసురు తగులుతుందంటూ అనసూయ ట్వీట్‌, రౌడీ హీరో ఫ్యాన్స్‌ ఫైర్‌
బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement