సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ములుగు రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో అబ్బాపూర్, బాణాలపల్లి, కుమ్మరిపల్లి, శ్రీరాములపల్లి గ్రామాలలో మంగళవారం వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది ప్రజలు డెంగీ, మలేరియా జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. మెగా వైద్య శిబిరంలో 363మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 16 మంది జ్వర పీడితులకు ఆర్‌డీటీ టెస్టులు నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేశారు. గ్రామాలలో దోమల నుంచి కాపాడుకునేందుకు దోమ తెరలను వినియోగించాలని సూచించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రో గ్రాం ఆఫీసర్ రణదీర్, పీహెచ్‌సీ వైద్యుడు ప్రసాద్, డాక్టర్లు ప్రేమ్‌సింగ్, దీపిక, దీప్తి, నవ్యరాణి, శ్రవణ్, నందకిశోర్, జితేందర్, నవ్యశ్రీ, ఏఎంఓ దుర్గారావు, హెల్త్ సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య
Comments
Please login to add a commentAdd a comment