ఆన్‌లైన్ ఎంట్రీ బాధ్యతతో చేపట్టాలి
ములుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్యుమరేటర్లు సేకరించిన ఇంటింటి కుటుంబ సర్వే ఆన్‌లైన్ ఎంట్రీని బాధ్యతతో చేపట్టాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన ఆన్‌లైన్ ప్రక్రియను కలెక్టర్ గురువారం దివాకర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి తప్పులు లేకుండా సేకరించిన డేటాను ఉన్నది ఉన్నట్లుగా ఆన్‌లైన్ చేయాలని సూచించారు. ఆపరేటర్లకు తగిన సూచనలు, సలహాలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్‌ఐ యుగేంధర్‌రెడ్డి, ఎంపీఓ రహీం, ఈడీఎం దేవేందర్ ఉన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి
పెయింటింగ్ వేయించాలి
ములుగు: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ప్రత్యేక నిధులు కేటా యించి పెయింటింగ్ వేయించాలని దళిత సంఘా ల నాయకులు గురువారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జన్ను రవి, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చుంచు రవి, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ సమితి జిల్లా చైర్మన్ నెమలి నర్సయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, అనిల్, దేవేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment