క్రియాశీల సభ్యత్వ నమోదులో ముందుండాలి
ములుగు రూరల్: భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదులో జిల్లా ముందుండాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ మదన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజు అధ్యక్షత సమావేశం నిర్వహించగా మదన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజనమోర్చా రాష్ట్ర కార్యదర్శి కొత్త సురేందర్, కత్తి హరీశ్, భాను, విక్రాంత్, సిద్ధార్థ, సురేశ్, మణికంఠ, రవితేజ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శిగా శంకర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఎస్‌టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శిగా పోరిక శంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోలం కృష్ణయ్య, జిల్లా బాధ్యులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ళ మధుసూదన్ హాజరయ్యారు. సమావేశంలో తాడ్వాయిలోని ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలలో పోరిక శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంఘ నిర్మాణంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు, జిల్లా బాధ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వంట కార్మికుల హామీలు అమలు చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వం వంట కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. వంట కార్మికులను అక్రమంగా తొలగింపును నిరోధిస్తూ జీఓ విడుదల చేయాలని అన్నారు. వంట కార్మికుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మెనూ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించాలని తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజు రూ. 25 చెల్లించడంతో పాటు గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో గున్నాల రాజకుమారి, రజిత, సరోజన, సమ్మక్క, రాధ, కమలక్క, లావణ్య, పధ్మ , లలిత , ముత్యాల రాజు పాల్గొన్నారు.
‘న్యాస్ పరక్ ’సర్వేను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: దేశవ్యాప్తంగా డిసెంబర్ 4న నిర్వహించనున్న న్యాస్‌పరక్– 2024 సర్వేను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. సోమవారం మండలంలోని బండారుపల్లి మోడల్ స్కూల్‌లో జరిగిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంపికై న 70 పాఠశాలల్లో సర్వేకు ఆటంకాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. సర్వేకు హెచ్‌ఎంలు, అబ్జర్వర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సహకరించాలని అన్నారు. సర్వే నిర్వహణ రోజు ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయకుండా విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా చూడాలని అన్నా రు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సూర్యనారాయణ, సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి జయదేవ్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment