మార్మోగిన శివనామస్మరణ
ఏటూరునాగారం: కార్తీక మాసంలో చివరిరోజు సోమవారం కావడంతో మండల కేంద్రంలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు, బిల్వార్చన పూజలను అర్చకులు రాజ్‌కుమార్ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివలింగానికి గోదావరి జలాలు, పాలు, పెరుగుతోపాటు పండ్లతో ప్రత్యేక అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు అర్చనలు చేశారు. అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా ఉసిరిచెట్టు వద్ద దంపతులు 365 ఒత్తులను వెలిగించారు. ఆయ్యప్పస్వామి, శివ, భవాని మాలధారులు చేరుకొని శివపార్వతులను దర్శించుకొని భజనలు చేశారు. ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మడుగూరి ప్రసాద్, డైరెక్టర్లు వల్స తిరుపతి, ఇర్సవడ్ల కిరణ్, రాంలాల్, సోమందరపు నర్సింహులు, పోషాలు, కొమురయ్య, రాధిక, అరుణ, లాలమ్మ, గ్రా మ పెద్దలు పాలకుర్తి పాపన్న పాల్గొన్నారు.
చివరి రోజు ఆలయానికి తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment