జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఏటూరునాగారం: ఏటూరునాగారం కరాటే అకాడమీకి చెందిన నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే స్కూల్ గేమ్స్‌కు ఎంపికై నట్లు కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోచ్ అబ్బు మస్టార్ తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీవీ గార్డెన్‌్స్‌లో జరిగిన అండర్–17 బాలబాలికల కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన చామర్తి ఐశ్వర్య, ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన బానోత్ అన్వేశ్, ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌కు చెందిన గూడూరి హర్షవర్దన్ గోల్డ్‌మెడల్స్ సాధించారన్నారు. డిసెంబర్ 9, 15 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ క్రీడలకు ఎంపికై నట్లు కోచ్ ఎండీ.అబ్బు తెలిపారు. కరాటే అకాడమీ ఏటూరునాగారానికి చెందిన వసంత విశాల్ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఎంపికై న విద్యార్థులను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి బి.వేణు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment