సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం : గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం స్థానిక గిరిజన దర్భార్‌లో గిరిజనుల నుంచి వినతులను పీఓ స్వీకరించి పరిశీలించారు.
● తాడ్వాయి మండలం లవ్వాల గ్రామం బోదబోయిన నాగరాణి అటవీ హక్కుల పత్రంలో బోదబోయిన నాగమణి తప్పుగా ప్రచురించడం జరిగిందని దానిని నాగరాణిగా సవరిస్తూ పట్టా ఇవ్వాలని కోరింది.
● మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన భూక్య రాములు ఫిట్టర్ పూర్తి చేశానని ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.
● వరంగల్ జిల్లా ఖానాపురం మండలం భూక్య అనిల్, ఇతరులు నాజీతండాలో మురుగుకాల్వ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. తండాలో కాల్వ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కోరారు.
● గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామానికి చెందిన భుక్య దేవేందర్ రోడ్లు, సైడ్ కాల్వలు మంజూరు చేయాలని కోరారు.
● వెంకటాపురం(కె) చెందిన భాగ్యవతి జాక్ ఎలక్ట్రానిక్ కుట్టుమిషన్ ఇప్పించాలని కోరింది.
● ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగేళ్ల నుంచి కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్నానని స్వీపర్‌గా నియమించాలని దుర్గి పద్మ పీఓకు విన్నవించారు.
● మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన శామంతకమని టైలరింగ్ శిక్షణ పొంది ఉన్నానని, కుట్టుమిషన్ ఇప్పించాలని కోరింది.
● జీసీసీ తాడ్వాయి మండలం బయ్యక్కపేటకు చెందిన 70 మంది గ్రామస్తులు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో ఇళ్ల స్థలాలు కల్పించాలని పీఓను వేడుకున్నారు. కార్యక్రమంలో డీఎం ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఓ సురేశ్‌బాబు, శిరీష్‌కుమార్, మహేందర్, కిషోర్, జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
Comments
Please login to add a commentAdd a comment