రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి
ములుగు : రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ రెండో ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏఎఫ్)లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు జమునారాణి, మంజుల మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని రెగ్యులర్‌తో పాటు ఇతర చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయాలన్నారు. దశలవారీగా ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని అన్నారు. 2023 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. పైగా ప్రస్తుతం వచ్చే డిసెంబర్ 29న రాతపరీక్ష ఉంటుందని ప్రకటించడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. సర్వీస్ వెయిటేజ్‌గా 50 మార్కులు ఇవ్వాలని, వయోపరిమితిని ఎత్తివేయాలని అన్నారు. కార్యక్రమంలో తిరుమల, నాగరాణి, సులోచన, పి.తిరుమల, సీతమ్మ, సమ్మమ్మ, ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment