అడవికి నిప్పు మానవాళికి ముప్పు
వాజేడు: అడవికి నిప్పు పెట్టడం మానవాళికి ముప్పని ఎఫ్‌ఎస్‌ఓ మల్ల నాగమణి అన్నారు. మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి గ్రామస్తులకు అటవీశాఖ సిబ్బంది సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. అడవికి నిప్పు అంటుకుంటే భారీనష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అడవికి ఇప్ప పువ్వు ఏరడానికి వెళ్లిన వారు పొరపాటున కూడా నిప్పు పెట్టవద్దని సూచించారు. ఆమె వెంట అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి సీఎం కప్
క్రీడాపోటీలు
ములుగు రూరల్: సీఎం కప్–2024 జిల్లాస్థాయి క్రీడా పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తులరవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని జాకారం సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 17నుంచి 22వ తేదీ వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనాలని వివరించారు.
అరుణాచలానికి
ప్రత్యేక బస్సు
ములుగు రూరల్: టీజీఎస్‌ఆర్‌టీసీ వరంగల్–2 డిపో నుంచి తమిళనాడు రాష్ట్రం అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలం వెళ్లే భక్తులు ఈ నెల 20నుంచి 23వ తేదీ వరకు 36 సీట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభించినట్లు తెలిపారు. హనుమకొండ నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరిప్రదక్షిణ, బీచుపల్లి హనుమాన్ టెంపుల్, గద్వాల జోగులాంబ అమ్మవారి ఆలయ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9959226048, 8919937008, 9866832734లలో సంప్రదించాలని తెలిపారు.
జ్వర పీడితులను గుర్తించాలి
ఏటూరునాగారం: సీజనల్ వ్యాధుల నివారణకు గిరిజన గ్రామాలలో ఇంటింటి సర్వే చేపట్టి జ్వర పీడితులను గుర్తించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వేను చేపట్టిన విషయంపై పీఓ మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే చేపట్టడం జరిగిందని, మరికొంత మందిని గుర్తించాల్సి ఉందన్నారు. జ్వర సర్వే బృందాలలో ఏఎన్‌ఎం, ఒక ఆశ కార్యకర్త, ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేదా హెల్త్ సూపర్‌వైజర్ ఉండాలని తెలిపారు. వీరందరినీ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతీ బృందం రోజుకు కనీసం 20–30 గృహాలను కవర్ చేసేలా జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె. క్రాంతికుమార్ పర్యవేక్షణ చేయాలన్నారు. గుర్తించబడిన జ్వరసంబంధమైన కేసులు సమీపంలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీకి పంపాలని తెలిపారు. ఐటీడీఏ పరిదిలో 22 పీహెచ్‌సీల్లో 145 మంది జ్వర పీడితులను గుర్తించినట్లు తెలిపారు. అలాగే 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 143 గ్రామాలలో 7,179 మంది కుటుంబాలకు 25,521 జనాభాకు స్క్రీనింగ్ చేసినట్లు పీఓ తెలిపారు.
సింగరేణి ఆవిర్భావ
వేడుకలకు ఏర్పాట్లు
భూపాలపల్లి రూరల్: ఈ నెల 23న బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఓటూ జీఎం కవీంద్ర అధికారులకు సూచించారు. అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, కావూరి మారుతి, బాలరాజు క్రాంతి కుమార్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment