గ్రామసభల్లోనే అర్హులను ఎంపిక చేయాలి
ఏటూరునాగారం: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక పారదర్శకంగా గ్రామ సభల్లోనే ఎంపిక చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవి కుమార్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ లోటు బడ్జెట్ పేరుతో సంక్షేమ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఎలాంటి తరుగు లేకుండా సన్నధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైస్ మిల్లర్లు జిల్లాలో రైతుల నుంచి అక్రమంగా 5నుంచి 10కిలోలు కోత విధిస్తున్నారని తెలిపారు. రైస్ మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కోతలపై మంత్రి సీతక్క దృష్టి సారించాలని కోరారు. రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కు పత్రాలపై రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ఎండీ దావూద్, చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీను, ఎండీ గపూర్, సుధాకర్, చిరంజీవి, నరసింహాచారి, దామోదర్, సౌమ్య, కృష్ణ బాబు, మల్లారెడ్డి, చిటమట రమేష్, చిన్న పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రవి కుమార్
Comments
Please login to add a commentAdd a comment