వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం చలిగాలులు వీస్తాయి. రాత్రి వేళ చలితో పాటు తీవ్ర మంచు కురుస్తుంది.
సమస్యలపై ప్రభుత్వం
చర్చించాలి..
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ.. పెన్షనర్ల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండడం వల్ల ఇబ్బంది అవుతోంది.
– ఇ.నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ
పెన్షనర్స్ సలహాదారుడు
ప్రభుత్వం చిన్నచూపు..
పెన్షనర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రధానమైన, న్యాయమై న సమస్యలు పరి ష్కరించుకుండా కావాలని జాప్యం చేస్తోంది. ఎన్నికల ముందు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పట్టించుకోవడం లేదు.
– తూపురాణి సీతారాం, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ
ఇబ్బందులు పెట్టడం సరికాదు..
వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం..? చేసిన సేవలకు గుర్తింపుగా, గౌరవంగా ఇచ్చేది పెన్షన్. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి. 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ ఇవ్వాలి.
– తిరువరంగం ప్రభాకర్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్
ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment