వినతులు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వినతులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై 27 దరఖాస్తులు రాగా కలెక్టర్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, సీపీఓ ప్రకాశ్, డీసీఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తులరవి, డీఈఓ పాణిని, డీసీఎస్‌ఓ ఫైజల్ హుస్సేనీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూఓ శిరీష, ఎల్డిఎం జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
18వినతులు..
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. మొత్తంగా గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై 18దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాడగూడెం(జి) సర్వే నంబర్ 27లో 10ఎకరాల భూమిని కొమురంభీమ్ ఆదివాసీలు సాగు చేసుకుంటున్నారని వారి భూ సమస్యను పరిష్కరించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ కార్యదర్శి పూనెం సాయి దరఖాస్తు అందజేశారు. చిరుతపల్లి గ్రామానికి చెందిన కొర్సా నర్సింహమూర్తి చెరుకూరు గ్రామానికి చెందిన సర్వే నంబర్ 106లో కోరం కనకయ్య పేరున ఉన్న భూమిలో గిరిజనేతరులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారని ఆపాలని వినతిపత్రం అందజేశారు. ఇలా పలువురు తమ తమ సమస్యలు పరిష్కరించాలని పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏలో వినతులు స్వీకరించిన
ఏఓ రాజ్‌కుమార్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఏఓ రాజ్‌కుమార్ పలువురు గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఏటూరునాగారం మండలం చెల్పాక గ్రామానికి చెందిన సుమతి చెల్పాక పెద్ద చెరువు మత్తడి కాల్వను పంట పొలాలకు రాకుండా చూడాలని విన్నవించారు. అలాగే బానాజీ బంధం గ్రామంలో సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, ఏఈ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment