ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గోవిందరావుపేట: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గల జెడ్పీహెచ్‌ఎస్‌లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నాల్గో మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యా యపరమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఉపాద్యాయుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని, ఎస్‌జీటీలకు పీఎస్ హెడ్‌మాస్టర్‌గా ప్రమోషన్స్ కల్పించాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు పాటుపడాలన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
టీఎస్ యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర కార్యదర్శులు రంజిత్, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోడెం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా రెడ్డి వాసుదేవ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జె.వెంకటస్వామి, అరుణ, కోశాధికారిగా ఎం.వెంకటస్వామి, కార్యదర్శులుగా చెంచయ్య, లక్ష్మీనారాయణ, ఎస్. పాపారావు, రఘురాం, శివరాం, స్వరూప, బాలాజీ, లక్ష్మారెడ్డి ఆడిట్ కమిటీ కన్వీనర్ లావుడ్యా దస్రునాయక్, సభ్యులుగా ఎం.హనుమంత్, సమ్మయ్య, రఘురాం, ప్రసాద్‌లుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సమ్మారావు, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, వెంకటాపురం ఎంఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా పోడెం సమ్మయ్య
Comments
Please login to add a commentAdd a comment