డ్రెయినేజీ నీళ్లు కాలనీలోకి రాకుండా చూడాలి
ములుగు : వర్షాకాలంలో వచ్చే వరదల సమయంలో డ్రెయినేజీ నీళ్లు కాలనీలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీ వా సులు అధికారులను కోరారు. ములుగు ప్రధాన రహదారి నుంచి బండారుపలి క్రాస్‌రోడ్డు నుంచి జీవంతరావుపల్లి క్రాస్ రోడ్డు వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపుల చేపడుతున్న మూడు ఫీట్ల సైడ్ డ్రెయినేజీ పనులను కాలనీ వాసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రస్తుతం చేపడుతున్న డ్రెయినేజీని గతంలో ఉన్న ఒక ఫీట్ డ్రెయినేజీకి లింకు కలపడం ద్వారా భవిష్యత్‌లో తీవ్ర ఇ బ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు ఇళ్లముందుకు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. డ్రెయినేజీ నీరు నేషనల్ హైవేకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు సుధాకర్, మోహన్, నవీన్, రమేష్, దయాకర్, నరేష్, రాజిరెడ్డి, సంపత్, సత్యనారాయణ, కృష్ణకుమార్, పాల్గొన్నారు.
పనులను అడ్డుకున్న కాలనీవాసులు
చర్యలు తీసుకోవాలని వినతి
Comments
Please login to add a commentAdd a comment