రామప్ప శిల్పకళ అద్భుతం
● ఆలయంలో భక్తులు, విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని భక్తులు, విదేశీయులు కొనియాడారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకుని చారిత్రక రామప్ప దేవాలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సోమవారం వచ్చే సోమవతి అమావాస్య రోజున శివరాధన చేసి రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలిగిపోతాయని ఆలయ ఆర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తెలిపారు. రామప్ప ఆలయానికి తరలివచ్చిన భక్తులు రామలింగేశ్వరస్వామికి పూ జలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణలు నిర్వహించారు. పర్యాటకులకు గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ ఆలయ విశిష్టత గురించి వివరించారు.
విదేశీయుల రాక..
రామప్ప టెంపుల్ బాగుందని హంగేరి దేశానికి చెందిన స్టీవ్, హిస్టర్న్, అమెరికా దేశానికి చెందిన ఎరిక్‌లు కొనియాడారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన వారు రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప బ్యూటిఫుల్ టెంపులు అని కొనియాడారు. ఈ సందర్భంగా విదేశీయులు రామప్ప ఆందాలను తమ సెల్‌ఫోన్‌లలో బంధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment