పెరిగిన దొంగతనాలు..
ములుగు: 2023తో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా దొంగతనాల సంఖ్య పెరుగగా పోలీసుల పనితీరు, చట్టాల అమలు, ముందస్తు అవగాహన కార్యక్రమాలతో లైంగికదాడుల కేసుల సంఖ్య భారీగా తగ్గిందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఎస్పీ వార్షిక నివేదిక వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో 2023లో 1,597 కేసులు నమోదు కాగా 2024లో 2,148 కేసులు నమోదయ్యాయి. అలాగే 2023లో 11 హత్య కేసులు న మోదు కాగా 2024లో 13 కేసులు రికార్డు అ య్యాయి. ఆయా దొంగతనాల్లో 1,63,48,076 నగదు చోరీకి గురికాగా పోలీస్ శాఖ తరఫున రూ.28,05,100లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదాల్లో 81మంది ప్రాణాలు కోల్పోగా గాయపడ్డ కేసులు 80 నమోదయ్యాయి. ముఖ్యంగా వేధింపుల కేసులు 80 నమోదు కావడం కాస్తంత ఇబ్బందికరంగా మారింది. 2024లో 30మంది కిడ్నాప్‌కు గురికావడం విశేషం. ఇక ఎస్సీ, ఎస్టీ కేసులు ఆందోళనకరంగా మారాయి. 2023లో 10 కేసులు మాత్రమే నమోదు కాగా 2024లో ఏకంగా 25 కేసులు నమోదయ్యాయి. లోక్ అదాలత్‌లో 3,407 కేసులు, 933 మోటర్ వెహికిల్ కేసులు, 883 ఇతర కేసులను పరిష్కరించారు. అలాగే ఆరుగురు మావోయిస్టులు లొంగిపోగా వారికి పునరావాసం కల్పించారు.
డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో డ్రగ్స్ నిర్మూలను ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్ ఫ్రీ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ములుగులో 10, ఏటూరునాగారంలో 16, వెంకటాపురం(కె)లో 14, వాజేడులో 17కేజీలు, పేరూరులో 168గ్రాములు, వెంకటాపురం(ఎం)లో 445 గ్రాముల గంజాయిని పట్టుకొని సీజ్ చేసి రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద కేసులు నమోదైన తర్వాత వాటిని పరిష్కరించేందుకు జిల్లాలో 375 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీక్షించడానికి జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని వివరించారు.
ఆదివాసీల సంక్షేమానికి 24గంటల విధులు
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల్లోని ఆదివాసీ కుటుంబాల సంక్షేమానికి పోలీసులు 24గంటలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైబర్ క్రైం కింద 32 కేసులు నమోదు చేశామని, లోక్ అదాలత్‌లో రూ.18,20,997 రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు. మేడారం జాతరకు రూ.1.20 కోట్ల మంది భక్తులు రాగా పటిష్ట భద్రత కల్పించామని వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ అజయ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేష్, సీఐలు రవీందర్, శ్రీనివాస్, ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, సతీశ్, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్, తాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
2023తో పోలిస్తే 2024లో 551 కేసులు ఎక్కువగా నమోదు
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
వార్షిక నివేదికలో వివరాలు
వెల్లడించిన ఎస్పీ డాక్టర్ శబరీశ్
Comments
Please login to add a commentAdd a comment