సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
ఏటూరునాగారం: సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పోడెం కృష్ణప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలో సీఆర్‌టీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ సమ్మెకు సంఘీభావం పలికి మాట్లాడారు. సీఆర్‌టీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. సీఆర్టీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ తక్షణమే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబోయిన సమ్మయ్య, కోటయ్య, జబ్బ రవి, బానోతు శ్రీనివాస్, ప్రకాశ్, సమ్మయ్య, లక్ష్మణ్‌రావు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇస్రో రాకెట్ ప్రయోగాన్ని
హర్షిస్తూ సంబురాలు
ములుగు: ఇస్రో స్పెండెక్స్ మిషన్ ఇన్‌స్పేస్ డాకింగ్ రాకెట్‌ను ప్రయోగించి ప్రపంచదేశాలకు భారతదేశ సాంకేతికతను సవాల్ విసరడాన్ని హర్షిస్తూ మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కన్వీనర్ జన్ను రవి, కో కన్వీనర్ నద్దునూరి రమేష్, నెమలి నర్సయ్య, అహ్మద్‌పాషా, అనిల్, రాజు, రాజ్‌కుమార్, నరేష్, సమ్మయ్య, మౌలానా, ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
‘బిల్ట్’ నుంచి
దట్టమైన పొగ
మంగపేట: మండల పరిధిలోని కమలాపురంలో కూల్చివేసిన బిల్ట్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి మంగళవారం సాయంత్రం 3గంటల ప్రాంతం నుంచి దట్టమైన పొగ ఎగిసిపడింది. మూతపడిన కర్మాగారాన్ని పూర్తిస్థాయి తొలిగింపు పనులు కొన్ని నెలలుగా చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు ఫ్యాక్టరీలోని భవనాలు, వాటి బేస్‌మెంట్‌ను బాంబులు అమర్చి పేల్చి వేస్తుండటంతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఫ్యాక్టరీలోని కలప స్టాక్ యార్డుకు నిప్పంటుకున్న సందర్భంలో వచ్చిన పొగకంటే ఎక్కువగా పొగ బ యటకు వచ్చి 12కిలో మీటర్ల మేర గ్రామాన్ని కమ్మేయడంతో ఏమి జరిగిందో తెలియక ప్రజ లు ఆందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలోకి బ యటి వ్యక్తులు ఎవరూ లోనికి రాకుండా చూ సేందుకు కాంట్రాక్టర్ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాడు. దీంతో ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో మండల ప్రజలు ఆయోమయానికి గురయ్యారు. రాత్రి వరకు ఫ్యాక్టరీలోని(ఎఫ్‌ఆర్‌పీ) పైపులు, సిల్ట్ పైపులకు చుట్టూ ఉన్న ప్లాస్టిక్‌ను తొలిగించేందుకు కాల్చి వేస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment