భూముల సర్వే..
ఏటూరునాగారం: అర్హులైన రైతులకు మాత్రమే రైతుభరోసా చెల్లించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎంత మంది రైతుల భూములు సాగులో ఉన్నాయి, అసైన్డ్ భూముల వివరాలు, సాగులో లేని భూముల వివరాలను సర్వే చేపట్టి పరిశీలించనున్నారు. ఈ సర్వేతో భూముల భాగోతం బయటపడనుంది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా అర్హులైన రైతులకు మాత్రమే రైతుభరోసా వర్తింపజేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. అర్హులైన రైతులకు మాత్రమే గుర్తించి రైతుభరోసా కింద రూ.12వేలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
రేపు గ్రామాల వారీగా సమావేశాలు
రేపు వ్యవసాయశాఖ అధికారులు మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులతో సమావేశాలను నిర్వహించనున్నారు. 16వ తేదీ నుంచి గ్రామాల వారీగా రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు పంట భూముల సర్వే చేపట్టి ఏ భూమిలో ఏముందని నమోదు చేసుకుంటారు. ఇలా 20వ తేదీ వరకు సర్వేలు చేపట్టి 21నుంచి 25వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహణ ఉంటుంది. ఈ సభల్లో సర్వే చేసిన ఆధారంగా పంట భూముల స్థితిగతులను తెలిపి రైతుభరోసా జాబితాలో నుంచి రైతుల భూముల పేర్లను తొలగించనున్నారు.
భూముల ప్రక్షాళన
సాగులో లేని భూములకు కూడా రైతుబంధు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో రైతుకు చెందిన నాలా కన్వెన్షన్, ల్యాండ్ అక్వివేషన్, ఇసుక మేటలు, మైనింగ్‌కు అప్పగించినవి, గృహ నిర్మాణాలు, సాగులో లేని భూములను గుర్తించి వాటిని రైతుభరోసా పథకం నుంచి అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్టే వేసే అవకాశం ఉంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్ సర్వేలు చేపట్టడం వల్ల అనేక భూముల బాగోతం బయటపడనుంది.
16 నుంచి సర్వే..
ఈ నెల 16వ తేదీ నుంచి గ్రామాల వారీగా సర్వేను చేపట్టనున్నారు. ఏ భూము స్థితిగతులు ఏంటని నమోదు చేసుకుంటారు. రైతు భరోసాకు ఇచ్చిన నిబంధనలకు లోబడి ఈ సర్వే చేయాల్సి ఉంది. అక్రమంగా రైతుబంధు పొందిన భూముల పేర్లను తొలగిస్తాం. సర్వేను మరింతగా పారదర్శకంగా చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
– సురేశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మండలాల వారీగా సాగుభూముల వివరాలు
రేపు ప్రజాప్రతినిధులు, రైతులతో అధికారుల సమావేశాలు
జిల్లాలో 16నుంచి 20వ తేదీ వరకు
సర్వే కొనసాగింపు
21నుంచి 25వ తేదీ వరకు గ్రామసభలు
సాగు భూములకు మాత్రమే అందనున్న రైతుభరోసా
Comments
Please login to add a commentAdd a comment