గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
మంగపేట: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని కమలాపురం శివారులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏటూరునాగారం–బూర్గంపాటు ప్రధాన రోడ్డుపై ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో గురువారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వాజేడు మండలానికి చెందిన మొరం కుమార్(25), నూగూరు వెంకటాపురం మండలానికి చెందిన వావిలాల సంతోష్(24), దాసరి ప్రవీణ్‌కుమార్(19) అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని సోదా చేయగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించింది. గంజాయి విలువ సుమారు రూ.63 వేలు ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. గంజాయి అమ్మినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై టీవీఆర్ సూరి, హెడ్‌కానిస్టేబుల్ చుక్కయ్య, కానిస్టేబుల్ మోహన్, ప్రసాద్, చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment