హామీకి కట్టుబడి ‘మల్లంపల్లి’ ఏర్పాటు
ములుగు: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేశామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్‌లతో కలిసి మల్లంపల్లి మండల రె వెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంను ప్రారంభించా రు. స్థానికులు మంత్రులకు డప్పుచప్పుళ్లు, కోలా టాలతో ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కృతజ్ఞత సభలో సీతక్క మాట్లాడారు. 10 సంవత్సరాలుగా మల్లంపల్లిని మండలం చేయాలని కోరుకున్న కల నెరవేరిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎంపీలు ములుగుకు వచ్చిన ప్రతీసారి ఇక్కడి నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఉండేవాళ్లని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు మాజీ జెడ్పీచైర్మన్ జగదీశ్ పేరుపై జేడీ మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసే ఫైల్ సీఎం టేబుల్‌ముందు ఉందన్నారు. దావోస్ పర్యటనతో వందల కోట్ల పెట్టుబడులు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని, కంపెనీలు మొదలయితే రాష్ట్రంలో 40 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
సమ్మక్క–సారలమ్మలా కలిసి పనిచేస్తాం:
మంత్రి కొండా సురేఖ
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్కతో కలిసి సమ్మక్క–సారలమ్మలా కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొంతమంది మీ డియా వాళ్లు సీతక్క, సురేఖలు ఎడమొఖం, పెడమొఖంగా ఉంటారని రాస్తున్నారని, అందులో ని జం లేదని, ఎప్పుడు కలిసినా మనసువిప్పి మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. ఒక అబద్దాన్ని పది సార్లు చెబితే నిజం అవుతుందనే ధోరణిలో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారన్నారు. రెవెన్యూ కార్యాలయ ప్రారంభోత్సవంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఓఎస్డీ గీతే మహేష్ భగవతే, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ విజయభాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ బొక్కా సత్తిరెడ్డి, వైస్ చైర్మన్ రాజు, మార్నేని రవీందర్, కూచన రవళీరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, గోల్కొండ రాజు, రవి, శ్యాం, రవిబాబు, చెరుకుపల్లి శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అడవులను సంరక్షించుకోవాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అడవులను సంరక్షణకు అటవీశా ఖ అధికారులు కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం మేడారంలో ఐటీడీఏ భవనంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అభివృద్ధి పనులకు అట వీశాఖ అధికారులు సహకరించాలన్నారు. అలాగే మేడారం వైజంక్షన్, రెడ్డిగూడెం గ్రామాల్లో నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు.
బ్లాక్‌బెర్రీ ఓ ఆహ్లాదకర పర్యాటక ప్రాంతం
పచ్చని అడవులు, పక్కనే పారుతున్న కాల్వ నీరు, చుట్టూర పరచుకున్న ఇసుక దిబ్బల మధ్య ఉన్న బ్లాక్ బెర్రీ ఓ ఆహ్లాదకర పర్యాటక ప్రాంతమని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాడ్వాయి మండలంలోని జనగలంచ సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీని శుక్రవారం మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇసుకపై ఏర్పాటు చేసిన గుడారాలు, సహజ సిద్ధంగా వెదురు, ఇతర అటవీ సంపదతో సిద్ధం చేసిన టేబుళ్లు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాలను ఆసక్తిగా తిలకించారు.
మంత్రి ధనసరి సీతక్క
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి
కలిసి పనిచేస్తాం
మంత్రి కొండా సురేఖ
Comments
Please login to add a commentAdd a comment