మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఏటూరునాగారం: గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల, స్పోర్ట్స్ కళాశాల, పాఠశాల, బాలుర, బాలికల కళాశాలలను సందర్శించారు. కళాశాలలోని డార్మటరీలను, డైనింగ్ హా ళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురుకుల చీఫ్ సెక్రటరీ ఆదేశాల మే రకు రెండు రోజులపాటు కళాశాలలను తనిఖీ చేశామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు విధిగా సమయపాలన పాటించాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో వంట గదులు అపరిశుభ్రంగా ఉండటంతో మండిపడ్డారు. క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని అధ్యాపకులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పరికరాలపై ఆరా తీశారు. అనంతరం ఇటీవల క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులను సన్మానించి మెడ ల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఆర్‌సీఓ హరిసింగ్, డీసీఓ శ్రీని వాస్ రెడ్డి, హెచ్‌ఎంలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలంగాణ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment