చట్టాలపై అవగాహన ఉండాలి
ములుగు రూరల్: బాలికల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ మేకల మహేందర్ అన్నారు.శుక్రవారం మండలంలోని జాకారం మినీ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. కార్యక్రమంలో స్వామి దాస్, రాజ్‌కుమార్, హెచ్‌ఎం అనిత, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికా విద్యను ప్రోత్సహించాలి
గోవిందరావుపేట: బాలికా విద్యను ప్రోత్సహించాలని చల్వాయి మోడల్ స్కూల్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రాంచందర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ మోడల్ స్కూల్ చల్వాయి గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి రమాదేవి ఆద్వర్యంలో గర్ల్ చైల్డ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చల్వాయి గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. అనంతరం రాంచందర్ మాట్లాడుతూ బాలికా విద్య బలోపేతమే భవిష్యత్ తరాలకు అసలైన ఆర్థిక పునాది అన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్వీయ నియంత్రణ తదితర వాటి గురించి అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment