మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఆరుగురికి ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో నాగరాజు, తిరుపతయ్య, సురేందర్‌గౌడ్, ఆంజనేయులు, రామచందర్, శ్రీనివాసులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి నారాయణపేట జిల్లాలో.. మరొకరికి నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి పొందిన ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లను డీఐజీ అభినందిస్తూ తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సుదీర్ఘ సేవలు, క్రమశిక్షణ గుర్తించి పదోన్నతి లభిస్తాయని, సేవలకు ప్రోత్సాహకరంగా ప్రతిఒక్కరూ ఉండాలని చెప్పారు.
వేరుశనగ క్వింటాల్
రూ. 6,932
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి 29 మంది రైతులు 319 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకువచ్చారు. క్వింటాల్ గరిష్ఠంగా రూ. 6,932, కనిష్టంగా రూ. 5,052, సరాసరి రూ. 6,270 ధర పలికింది. కాగా, మార్కెట్‌లో వేరుశనగ ధర తగ్గుముఖం పట్టడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment