జిల్లాకు గిరివికాసం పథకం కింద ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ. 2.29 కోట్లు కేటాయించింది. జిల్లావ్యాప్తంగా మండల కమిటీల ద్వారా స్క్రీనింగ్ అనంతరం రైతుల నుంచి మొత్తం 100 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఒక్కో యూనిట్ బోరుబావి తవ్వకం కోసం జియాలజిస్టుల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అధికారులు బోరు డ్రిల్లింగ్‌ను పూర్తిచేయలేదు. బోరు విద్యుత్ కనెక్షన్ కోసం వస్తున్న దరఖాస్తులను సైతం అధికారులు పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. సకాలంలో దరఖాస్తులను పూర్తిచేయాల్సిన అధికారులు.. తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు నెపం పెడుతూ తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఐటీడీఏ, డీఆర్‌డీఏ, భూగర్భజలవనరుల శాఖ, విద్యుత్‌శాఖ అధికారుల సమన్వయంతో పథకం అమలుకావాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యంతో పథకం ముందుకుసాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment