నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Published Sun, Feb 2 2025 1:21 AM | Last Updated on Sun, Feb 2 2025 1:20 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌

వాతావరణం

చల్లని గాలులు వీయడంతోపాటు

మంచు కురుస్తుంది. రాత్రి చలి ఎక్కువగా

ఉంటుంది. ఎండ ప్రభావం చూపిస్తుంది.

ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

వివరాలు IIలో u

మ్మడి జిల్లాకు జీవనాడిగా మారే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం అందించాలన్న డిమాండ్‌ ఉండగా.. బడ్జెట్‌లో దీనిపై ప్రస్తావనే కరువైంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేయాల్సిన భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ఉమ్మడి పాలమూరులోని కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఉమ్మడి జిల్లాలోని పురాతన, ప్రముఖ దేవాలయాలకు ప్రసాద్‌ స్కీం పథకం కింద కేంద్రం నుంచి నిధులు అందుతాయని ఆశించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు లేకుండాపోయింది.

సులభంగా రుణాలు..

వ్యవసాయ రంగంలో సాంకేతికత పెంచడం, వలసలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంది. పంటల ఉత్పాదకత, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంచాయతీ, బ్లాక్‌ స్థాయిల్లో గోదాంలు, నీటి పారుదల, రుణ సౌకర్యాలను మరింత పెంచాలని నిర్ణయించింది. అలాగే రైతుల పెట్టుబడి కోసం అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేయకుండా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 5.50 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో ఖర్చులు, పరికరాల కొనుగోలు కోసం రైతులు స్వల్పకాలిక రుణాలు పొందవచ్చు. రానున్న ఐదేళ్లపాటు పత్తి పంట ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పత్తి పంట మద్దతు ధర పెంచేందుకు అవకాశం ఉంది.

చేనేత కార్మికులకు దన్ను..

ముఖ్యంగా మేక్‌ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా దేశంలో తయారైన స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఉన్న మర మగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,600 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపుతో చేనేత దుస్తుల ధరలు తగ్గనున్నాయి. కాగా.. పొగాకు, సిగరెట్లపై పన్నులను కేంద్రం పెంచడంతో వాటి ధరలు మరింత పెరగనున్నాయి.

వినతులు బుట్టదాఖలు

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని చేసిన మా వినతులు బుట్టదాఖలయ్యాయి. కనీసం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రజలు ఏటా రూ.లక్ష కోట్ల వరకు పన్నులు కడుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

ప్రధానికి కృతజ్ఞతలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ముమ్మాటికీ ప్రజా ఆమోద బడ్జెట్‌. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం శుభపరిణామం. పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రజలకు అనుకూలంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్‌

10 నుంచి

సదరం క్యాంపులు

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీ నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రఘు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 17, 24 తేదీల్లో శారీరక దివ్యాంగులకు.. 10, 17 తేదీల్లో వినికిడి లోపం ఉన్నవారికి.. 18న కంటిచూపు లోపం ఉన్నవారికి.. 17, 24 తేదీల్లో మానసిక దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సదరం క్యాంపులకు హాజరయ్యే దివ్యాంగులు ఈ నెల 3వ తేదీలోగా మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న రశీదు, ఆధార్‌, మెడికల్‌ రిపోర్టులతో సదరం క్యాంపులకు హాజరు కావాలని తెలిపారు.

టెన్నిస్‌లో

ఎస్పీకి కాంస్య పతకం

నాగర్‌కర్నూల్‌ క్రైం: కరీంనగర్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ – 2025 టెన్నిస్‌ విభాగంలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ప్రతిభకనబరిచి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లాకు చెందిన పోలీసులు వివిధ పోటీల్లో రాణించి పతకాలు సాధిస్తున్నట్లు తెలిపారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ఊర్కొండ: ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. జనవరి 25న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. వారం రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చివరి రోజున ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోనేరులో స్వామివారి ఉత్సవ మూర్తికి చక్రస్నానం అనంతరం సిద్ధి వినాయక మండపం వద్ద పూజలు చేశారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో గ్రామ పురవీధుల్లో ఊరేగించిన అనంతరం అర్చకులు సిరివెల్లి దత్తాత్రేయశర్మ, శ్రీను శర్మ ఇంటికి చేర్చడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, ఈ ఓ సత్యచంద్రారెడ్డి, కమిటీ సభ్యులు గోపి నా యక్‌, బొందయ్యగౌడ్‌, వెంకటయ్య, పత్యానా యక్‌, బంగారయ్య, మల్లేష్‌ యాదవ్‌, రమేష్‌, ఆంజనేయులు, వెంకటయ్య పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులకు తప్పని భంగపాటు

పర్యాటక రంగ అభివృద్ధికిలభించని చేయూత

ఊసేలేని మాచర్ల– గద్వాల, కొత్త రైల్వే మార్గాలు

రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుపై హర్షాతిరేకాలు

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో 5.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం

స్వదేశీ దుస్తులకు పన్ను తగ్గింపుతో 4,600 చేనేత కార్మికులకు మేలు

ఈసారి నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగం తర్వాత గ్రామీణాభివృద్ధికే అత్యధిక శాతం నిధులు కేటాయించింది. ఈ మేరకు మొత్తం రూ.2,66,817 కోట్ల కేటాయింపులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించనుంది. దీంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వేగంగా అడుగులు పడనున్నాయి. ఆ తర్వాత వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి విరివిగా రుణాలు మంజూరు చేయనున్నారు. అంగన్‌వాడీ పోషణ్‌ 2.0 ప్రాజెక్ట్‌ ద్వారా చిన్నారులకు పోషకాహారం పెంచడంతో పాటు మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డే కేర్‌ కేన్సర్‌ సెంటర్స్‌’ ఏర్పాటు చేయనున్నారు.

ఉద్యోగులకు మేలు..

ఆదాయపు పన్ను చెల్లించే పౌరులకు ఈ బడ్జెట్‌తో మేలు కలుగుతుంది. ఉద్యోగులు, ప్రతి ఒక్కరికీ రూ. 12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయం. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు లాభం చేకూరుతుంది. రైతులు, విద్యార్థులు, చిన్న పరిశ్రమలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. – బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి,

జిల్లా అధ్యక్షుడు, విశ్రాంత ఉద్యోగుల సంఘం

వికసిత భారత్‌కు బాటలు..

కేంద్ర బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. వికసిత భారత్‌కు బాటలు వేసేలా బడ్జెట్‌ ఉంది. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం, ఉత్పత్తుల సహకారానికి నిధుల కేటాయింపులు బాగున్నాయి. వేతన జీవులకు రూ. 12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి ప్రజలకు మేలుచేసే అంశం. అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి సమతుల్యం ఇచ్చిన బడ్జెట్‌గా చెప్పవచ్చు.

– ఎల్లేని సుధాకర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

నిరాశాజనకం..

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు నిరాశకు గురిచేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు కొట్లాడుకోవడమే తప్ప బడ్జెట్‌లో సాధించిందేమీ లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించకుండా మరోసారి మోసం చేశారు. ఎన్నికలు ఉన్న మూడు రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. తెలంగాణను పూర్తిగా విస్మరించారు.

– గువ్వల బాలరాజు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

కరుణించని.. నిర్మలమ్మ

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
నాగర్‌కర్నూల్‌1
1/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌2
2/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌3
3/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌4
4/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌5
5/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌6
6/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌7
7/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌8
8/9

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌9
9/9

నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement