అస్వస్థతకు గురైన విద్యార్థులకు కలెక్టర్ పరామర్శ
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురై దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment