నల్లగొండ : క్రైస్తవులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తప్పులకు క్షమాపణ కోరడం.. బాధితులకు అండగా నిలవడమే క్రిస్మస్ చెప్పే సందేశమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం.. వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.
గుత్తా శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పవిత్రమని, క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment