నామినేటెడ్‌పై నజర్!
అద్దంకి దయాకర్‌కు
ఎమ్మెల్సీ పదవి దక్కేనా?
పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం మందుల సామేల్‌కు టికెట్ ఇచ్చింది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యేల కోటాలో త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవుల్లో దయాకర్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అన్న చర్చ సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న చర్చ మళ్లీ జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుందన్న సమాచారంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం పోటీపడి అధిష్టానం హామీతో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకున్న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరికి మొదటి విడతలో పలువురికి పదవులు దక్కాయి. రెండో విడతలో ఎవరికి బెర్త్ దక్కనుందో త్వరలో తేలనుంది.
ఇప్పటికే ఐదుగురికి స్థానం..
ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఐదుగురికి కీలక పదవులను కట్టబెట్టింది. అందులో టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా పటేల్ రమేష్‌రెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ముత్తినేని వీరయ్య, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా చెవిటి వెంకన్న యాదవ్, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా గుత్తా అమిత్‌ను నియమించింది. ప్రస్తుతం పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, కీలకమైన కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులతో పాటు, వైటీడీఏ చైర్మన్, గ్రంథాలయసంస్థ చైర్మన్, సూర్యాపేట, మిర్యాలగూడ వంటి కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
నల్లగొండ జిల్లాలో
కొందరికి పదవి ఖాయమని చర్చ
నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లాలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జానారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కర్నాటి లింగారెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి దాదాపు ఖరారైందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కొన్ని కారణాలతో అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు కూడా జానారెడ్డి అండదండలు ఉన్నాయని, ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డికి పదవి ఇప్పిస్తానని ఇదివరకే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయనకు పదవి వచ్చేలా మంత్రి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టీపీసీపీ అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ వెన్నంటి ఉన్న పున్న కై లాష్ నేతకు స్థానం కల్పిస్తారన్న చర్చ సాగుతోంది. నకిరేకల్‌లో కొండేటి మల్లయ్య, దైద రవీందర్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వారే. వారిలో ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
ఆలేరు, భువనగిరిలోనూ..
ఆలేరు నియోజకవర్గానికి చెందిన యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యుడు జనగామ ఉపేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పద్మ పదవులు వస్తాయన్న ఆశల్లో ఉన్నారు. అండెం సంజీవరెడ్డికి అధిష్టానం నుంచి హామీ ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. భువనగిరి నియోజకవర్గానికి చెందిన పోత్నక్ ప్రమోద్ కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, రామాంజనేయులు, యుగేందర్‌రెడ్డి, శివరాజ్‌గౌడ్, తడక రమేష్ సైతం ఈసారి కీలకమైన పదవులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ కమిటీని నియమిస్తే అందులో వేనేపల్లి చందర్‌రావు వంటి నేతలను పరిగణనలోకి తీసుకోవచ్చన్న చర్చ సాగుతోంది.
కార్పొరేషన్ పదవుల కోసం నేతల పోటీ
ఫ తొలివిడతలో కొందరికే దక్కిన బెర్త్
ఫ ఇప్పుడు రెండో విడత నియామకాలు చేపడతారని చర్చ
ఫ ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
Comments
Please login to add a commentAdd a comment