సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు పనులు అడ్డగింత
రామన్నపేట : డ్రైపోర్టు పేరుతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జెల్లెల పెంటయ్య, కోకన్వీనర్ ఎండీ రెహాన్ హెచ్చరించారు. సిమెంట్ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతంలో శుక్రవారం యంత్రాలతో పనులు చేపడుతుండగా అడ్డుకున్నారు. పనులను కొనసాగించవద్దని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో నూటికి నూరుశాతం ప్రజలు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించారని, అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపట్టడం ఆక్షేపణీమన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, కందుల హన్మంతు, కల్లూరి నాగేష్, గొరిగె సోములు, ఎండీ రశీద్, మునుకుంట్ల లెనిన్, శానగొండ వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీశైలం, రేపాక లింగస్వామి, మోటె నరేష్, పుట్టల ఉదయ్, గుండాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment