డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు చివరి అవకాశం
నల్లగొండ రూరల్: 2011–2020 మధ్య ఫెయిలైన డిగ్రీ విద్యార్థులకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ చివరి అవకాశంగా ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పించిందని పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించేందుకు 2025 ఫిబ్రవరి 12 చివరి గడువు అని పేర్కొన్నారు. 2011–16, 2016–2020 సీబీఎస్, నాన్ సీబీఎస్ విద్యార్థులు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
నిబంధనలు పాటించాలి
పెద్దఅడిశర్లపల్లి: ఫర్టిలైజర్ దుకాణాదారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) శ్రవణ్‌కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద గల ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాదారులు ఈ పాస్ ద్వారానే ఎరువులు, విత్తనాలు అమ్మకాలు జరపాలన్నారు. రైతులకు తప్పనిసరిగా రశీదు అందజేయాలన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపొద్దన్నారు. ఆయన వెంట ఏఓ పాండు, ఏఈఓలు ఉన్నారు.
గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయాలి
నల్లగొండ: వానాకాలం, యాసంగి–2022–23, 2023–2024 సీజన్లకు సంబంధించి 100 శాతం సీఎంఆర్‌ను వచ్చే నెల 25లోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు 85 శాతం సీఎంఆర్ డెలీవరీ పూర్తయిందని మిగతా 15 శాతం పూర్తి చేయాలన్నారు. 2024–25 వానాకాలనికి సంబంధించి నాణ్యమైన సన్నబియ్యం త్వరగా డెలీవరీ చేయాలని తెలిపారు. సివిల్ సప్లయ్ శాఖ నాణ్యతతో కూడిన బియ్యానికి మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీపోటీలకు ఎంపిక
పెద్దవూర: మండలంలోని వెల్మగూడెం గ్రామానికి చెందిన అనిల్ అండర్–20 బాలుర జూనియర్ విభాగం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు జెడ్పీహెచ్‌ఎస్ వెల్మగూడెం వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్‌బాబు తెలిపారు. ఇటీవల అనుముల మండలం ఇబ్రహీంపేటలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనపర్చడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు జనగాం జిల్లాలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment