జాబితాను పారదర్శంగా రూపొందించాలి
నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 2, 3 మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, పీఆర్ ఎస్‌ఈ తిరుపతయ్య, విద్యుత్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఎంపీఓలు పర్యవేక్షించాలి
గ్రామాలు, అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా ప్రతిరోజూ మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓలు) పర్యవేక్షించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె నల్లగొండ కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ఎంపీఓలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎంపీఓలు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని, ఒకవేళ గైర్హాజరైనట్లయితే వారి సర్వీస్‌ను డైస్ నాన్ కింద పరిగణిస్తామన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు ఆయా అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో జనవరి 15 లోగా పన్ను వసూళ్లను పూర్తిచేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 31లోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీపీఓ మురళి, హౌసింగ్ పీడీ రాజకుమార్, ఎంపీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment