దేవరకొండ:
ఫ దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని 200 పడకలకు పెంచేందుకు పట్టణంలోని పలుచోట్ల స్థల పరిశీలిన చేశారు. ఇందుకు గాను రూ.89 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా అనుమతులు రావాల్సి ఉంది.
ఫ ఎస్‌డీఎఫ్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ నిధులు రూ.50 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది.
ఫ కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ములో రెండు కేజీబీవీ భవనాలు నిర్మాణం పూర్తయింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో పురోగతి
శ్రీశైలం సొరంగ మార్గం (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. అమెరికా నుంచి టీబీఎం(టన్నెల్ బేరింగ్ మిషన్) సముద్ర మార్గాన బయల్దేరింది. సెప్టెంబర్ 20న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ధేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసేందుకు రూ.4,637కోట్లను కేటాయిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. 2027 నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment