ఫామ్‌హౌస్ పార్టీలపై ప్రత్యేక నిఘా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నాం.. ఈసారి ఫామ్‌హౌస్ పార్టీలపై ప్రత్యేక నిఘా పెట్టాం’ అని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇళ్ల ముందు ముగ్గులు వేసే సమయంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.
ఫామ్‌హౌస్‌ల వివరాలు సేకరణ
ఫామ్‌హౌస్ పార్టీలు, వాటిల్లో సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెడతాం. ఇప్పటికే ఫామ్ హౌస్‌ల వివరాలు సేకరించాం. వాటిల్లో వేడుకల నిర్వహణకు టికెట్లు అమ్మకం వంటివి చేపడితే కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. వాడపల్లి, చెర్వుగట్టు, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో భక్తుల రాకపోకలకు, దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. మొత్తంగా పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రత్యేక నిఘా ఉంటుంది.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
ప్రజల భద్రత కోసం, వేడుకలను శాంతియుతంగా జరిపేందుకు చర్యలు చేపడుతున్నాం. సీసీఎస్ పోలీసులను బందోబస్తులో భాగస్వాములను చేస్తున్నాం. మహిళలను వేధించకుండా ఆకతాయిలను ఆటకట్టించేందుకు షీటీమ్స్ బృందాలు గస్తీ తిరుగుతాయి. ఏదైనా అత్యవసరం ఉంటే 100 నంబర్‌కు ఫోన్ చేయండి. నేను స్వయంగా బందోబస్తులో పాల్గొంటా.
బందోబస్తులో నేను పాల్గొంటా
మహిళలను వేధిస్తే కేసులు
ఎస్పీ శరత్‌చంద్ర పవార్
రెట్టింపునకు మించి డ్రంకెన్ డ్రైవ్
బృందాలు
మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపడం, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించేలా రోడ్లపైనే వేడుకలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపడితే సహించబోం. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ లాంటి ముఖ్య పట్టణాల్లో ప్రత్యేక దృష్టిని సారించాం.యాక్సిడెంట్, ఇన్సిండెంట్ ఫ్రీగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించా. పట్టణంలో డ్రంకెన్ డ్రైవ్ సాధారణంగా నాలుగు చోట్ల పెడతాం. రెట్టింపునకు మించి డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్‌లు ఏర్పాటు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment